: జయతో పాటే ఖననమైన బంగారు గాజులు, గడియారం!


తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత వాటిని ఎంతో ముచ్చటపడి చేయించుకున్నారు. ఎన్నడూ వాటిని విడిచి పెట్టలేదు. ఏళ్ల తరబడి అవి ఆమెను అంటిపెట్టుకునే ఉన్నాయి. అవే ఆమె ఎన్నడో చేయించుకున్న బంగారు గాజులు! అవంటే జయలలితకు ఎంతో ఇష్టం. వీటితో పాటు ఆమెను అనునిత్యం అంటిపెట్టుకుని ఉండేది మరొకటి కూడా ఉంది. అది జయ చేతి గడియారం. ఈ విషయం జయ నెచ్చెలి శశికళకు తెలుసు. అందుకే జయ పార్థివదేహం నుంచి గాజులను, గడియారాన్నీ తీయకుండానే ఖననం చేసినట్టు తెలుస్తోంది. తనకెంతో ఇష్టమైన, అత్యధికంగా కనిపించే ఆకుపచ్చ చీరలో, తనకు నచ్చిన గాజులు, గడియారాలతో పాటు ఆమె భూమాత ఒడిలోకి చేరిపోయారు.

  • Loading...

More Telugu News