: విజయవాడలోని శ్రీదేవి కంటి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు


విజయవాడ నక్కలరోడ్డులోని శ్రీదేవి కంటి ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆస్పత్రి లోపల సిబ్బంది ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News