: జయలలిత సన్నిహితుడు, రమ్యకృష్ణ మేనమామ చో రామస్వామి మృతి


ప్రముఖ పాత్రికేయుడు, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత వ్యక్తిగత సలహాదారుడు చో రామస్వామి(82) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జయలలితకు అత్యంత సన్నిహితుడు అయిన రామస్వామి నటుడు కూడా. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రామస్వామి కూడా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం. ప్రముఖ నటి రమ్యకృష్ణకు చో రామస్వామి స్వయానా మేనమామ. 'తుగ్లక్' పత్రికకు సంపాదకుడుగా ఆయన పనిచేశారు. తుగ్లక్ నాటకంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. పలు సినిమాలు, నాటకాల్లో నటించారు. దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News