: జయలలిత గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు!
దివంగత సీఎం జయలలిత గురించిన పలు ఆసక్తికర విషయాలు చాలామందికి తెలుసు. అయితే, ఆమె గురించి మరికొన్ని ఆసక్తికర విషయాలు.. * 15 ఏళ్ల వయసులో జయలలిత నటించిన మొదటితమిళ చిత్రం ‘వెన్నిరా ఆడై’ పెద్దలకు మాత్రమే నట. దాంతో ఈ చిత్రాన్ని ఆమె చూడలేదట. * సీఎంగా తన మొదటి జీతాన్ని చెక్ రూపంలో అందుకోవడానికి ఆమె తిరస్కరించారు. ‘కాదు, కూడదు’ అని ఆమె సన్నిహితులు చెబితే.. తప్పని పరిస్థితుల్లో జీతం అందుకున్నారు. అదికూడా.. ప్రజాసేవకురాలిగా నెలకు కేవలం రూ.1 మాత్రమే. * హిందీ చిత్రం ‘ఇజ్జత్’ లో ధర్మేంద్ర సరసన ఆమె నటించింది. * దత్త పుత్రుడు వివాహం అత్యంత గ్రాండ్ గా చేసిన జయలలిత పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు ఎక్కింది అని ఆ కథనంలో పేర్కొన్నారు.