: ఆమె మరణంతో ప్రతిఒక్కరికీ నాయకురాలైపోయింది : డీఎంకే కార్యకర్తలు


తాము ఏ పార్టీకి చెందిన వాళ్లం అనే విషయం ముఖ్యం కాదని, జయలలిత మరణంతో ఆమె ప్రతిఒక్కరికీ నాయకురాలు అయిపోయిందని మనికందన్ అనే డీఎంకే పార్టీ కార్యకర్త అన్నారు. చెన్నైలో జరిగిన జయలలిత అంత్యక్రియలకు పార్టీలతో ప్రమేయం లేకుండా ప్రజలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పలువురు డీఎంకే కార్యకర్తలు తమ మనసులో మాటను చెప్పారు. జయలలిత నిజమైన నాయకురాలని, తమ పార్టీ అధినేత కరుణానిధిని ఢీకొనే సత్తా గత నేత అని అరుంబాకంలోని తన ఇంటి బయట జయలలిత ఫొటోను పెట్టుకున్న డీఎంకే విశ్వాసపాత్రుడు ఎల్.శరవణన్ అనే వ్యక్తి చెప్పాడు. అంతేకాకుండా, డీఎంకేకు చాలా పట్టు ఉన్న చేపాక్, ట్రిప్లికేన్, అన్నానగర్, ఎగ్మోర్ తదితర ప్రాంతాలకు చెందిన డీఎంకే కార్యకర్తలు జయలలిత అంత్యక్రియలకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News