: తాడేపల్లిగూడెం వద్ద అంబులెన్స్ దగ్ధం... నలుగురు సేఫ్
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద ప్రైవేటు అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. అంతా చూస్తుండగానే అంబులెన్స్ దగ్థమైంది. మంటలను గుర్తించిన అంబులెన్స్ డ్రైవర్ సకాలంలో అప్రమత్తం కావడంతో అందులోని నలుగురు ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఏలూరు నుంచి తణుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అంబులెన్స్ లోని వారు ప్రాణాలతో బయటపడడంతో అంతా హాయిగా ఊపిరిపీల్చుకున్నారు.