: వెండితెరపై యువరాజ్ సింగ్ బయోపిక్...హీరో అక్షయ్ కుమార్?
వెండితెరపై ధోనీ బయోపిక్ అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వంద కోట్ల క్లబ్ లో ఆ సినిమా చేరడంతో క్రికెటర్ల జీవిత గాథలపై బాలీవుడ్ దర్శక, నిర్మాతలు దృష్టిసారించారు. దీంతో ప్రస్తుతమున్న టీమిండియా క్రికెటర్లలో అత్యంత స్ఫూర్తిమంతమైన యువరాజ్ సింగ్ బయోపిక్ నిర్మించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను నటింపజేసే దిశగా చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. గతవారం వివాహం చేసుకుని హనీమూన్ కు వెళ్లిన యువరాజ్ సింగ్ ఇండియా తిరిగి రాగానే బయోపిక్ పై చర్చలు జరిపి సినిమా ఫైనల్ చేయనున్నట్టు తెలుస్తోంది. కాగా, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ బయోపిక్ ఆధారంగా కూడా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.