: నన్ను రాష్ట్రపతిగా చూడాలని జయలలిత అనుకున్నారు: సుబ్రహ్మణ్య స్వామి
జయలలిత తనను రాష్ట్రపతిగా చూడాలనుకున్నారని సుబ్రహ్మణ్య స్వామి నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. జయలలితకు నాటి మిత్రుడు, ఆ తర్వాత బద్ధశత్రువుగా మారిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, జయలలిత సన్నిహితురాలు అయిన శశికళపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత జీవితాన్ని సర్వనాశనం చేసింది శశికళేనని ఆరోపించారు. కాగా, జయలలిత మృతిపై ఆయన తన సంతాపం ప్రకటించారు.