: అన్నాసాలైని చేరుకున్న జయలలిత పార్థివదేహం
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహం రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్ కు చేరుకుంది. త్రివిధదళాధికారుల పర్యవేక్షణలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాల పహారా మధ్య అమ్మ కడచూపుకోసం వేలాది మంది అభిమానులు రోడ్డు పక్కన నిలబడి చూస్తుండగా అంతిమయాత్ర కొనసాగింది. దారిపొడవునా ఆమె అభిమానుల రోదనలు మిన్నంటాయి. ఆమె కడచూపుకోసం అన్నాసాలైకు భారీ ఎత్తున జనం చేరుకున్నారు.