: జయలలిత మృతిపై కరుణానిధి సంతాపం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై డీఎంకే అధినేత కరుణానిధి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జయలలిత పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిగా నిలిచిపోతాయని, పార్టీ సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసం జయలలిత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహానికి తావులేదన్నారు. చిన్నవయసులోనే కన్నుమూసిన జయలలిత పేరు ప్రఖ్యాతులు చిరస్థాయిగా నిలిచి ఉంటాయని అన్నారు.