: అంత్యక్రియలు పూర్తికాకముందే వివాదం రేపిన కమలహాసన్ ట్వీట్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు ఇంకా పూర్తికాలేదు. ఇంతలో ప్రముఖ తమిళ సినీ నటుడు కమలహాసన్ పెట్టిన ట్వీట్ కలకలం రేపుతోంది. ఆమెకు నివాళులర్పించాల్సిన కమలహాసన్ అలా చేయకుండా తన ట్విట్టర్ ద్వారా 'జయలలితపై ఆధారపడి బతుకుతున్న వారందరికీ నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశారు. ఇది పెను వివాదం రేపుతోంది. జయలలిత అభిమానులు కమలహాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, కమల్ అభిమాని ఒకరు నీ అభిమాని అయినందుకు సిగ్గుపడుతున్నానంటూ ట్వీట్ చేశాడు. కాగా, గతంలో కమల్ కు, జయలలితకు మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
சார்ந்தோர் அனைவருக்கும் ஆழ்ந்த அனுதாபங்கள்.
— Kamal Haasan (@ikamalhaasan) 6 December 2016