: తెలంగాణ ప్రభుత్వం తరపున జయ అంత్యక్రియలకు హాజరైన నేతలు


దివంగత ముఖ్యమంత్రి జయలలితను కడసారి వీక్షించి, నివాళి అర్పించేందుకు ప్రధాని మోదీ, మాజీ ప్రధాని దేవేగౌడ, చంద్రబాబు, సిద్ధరామయ్య, నవీన్ పట్నాయక్, నితీశ్ కుమార్ తదితర ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, తెలంగాణ నుంచి చెన్నై ఎవరు వెళ్లారు?... అసలు ఎవరైనా వెళ్లారా? లేదా? అనే సందేహం అందర్లోను నెలకొంది. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు హరీష్ రావు, నాయిని నర్సింహారెడ్డిలు జయ అంత్యక్రియలకు హాజరయ్యారు. రాజాజీ హాలు వద్ద ఉన్న జయ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి... వీరిద్దరూ నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News