: జయలలిత పార్థివదేహాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పుష్ఫగుచ్ఛంతో జయలలిత పార్థివదేహానికి నివాళులర్పించారు. రాహుల్ గాంధీతోపాటు గులాం నబీ ఆజాద్ కూడా ఉన్నారు. కాసేపట్లో జయలలిత అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో జయలలితకు అంత్యక్రియలు జరుగుతాయి.

  • Loading...

More Telugu News