: జయలలిత పార్థివదేహాన్ని సందర్శించిన చంద్రబాబు


తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పార్థివదేహాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందర్శించారు. చెన్నైలోని రాజాజీహాల్ లో ఉంచిన ఆమె పార్థివదేహానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె పార్థివదేహం వద్ద చిన్నపాటి తొక్కిసలాట జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జనంలో చిక్కుకుపోయారు. చంద్రబాబు వెంట వచ్చిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆమె పార్థివదేహం వద్దకు వెళ్లడానికి చాలా సమయం పట్టింది.

  • Loading...

More Telugu News