: నా కెరీర్ ప్రారంభంలో ఆమెను చాలాసార్లు కలిశాను: నటుడు మోహన్ బాబు


‘నా కెరీర్ ప్రారంభంలో జయలలితను చాలాసార్లు కలిసి మాట్లాడాను. కలిసిన ప్రతిసారి గొప్ప అదృష్టంగా భావించాను’ అని ప్రముఖ నటుడు మోహన్ బాబు అన్నారు. జయలలిత గొప్ప నటి, రాజకీయ నాయకురాలు అని, మనల్ని విడిచిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గొప్ప జనాకర్షణ నేత మాత్రమే కాదు, గొప్ప మనసు ఉన్న నేత కూడా అని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానని మోహన్ బాబు అన్నారు.

  • Loading...

More Telugu News