: జయలలిత నాకు తల్లి లేని లోటు తీర్చారు: రోజా
జయలలితతో తన జీవితం ముడిపడిపోయిందని సినీ నటి, వైఎస్సార్సీపీ నేత రోజా తెలిపారు. తన వ్యక్తిగత జీవితంలోను, రాజకీయ జీవితంలోను ఆమె పాత్ర ఎంతో ఉందని అన్నారు. తన వివాహం దగ్గరుండి ఆమె జరిపించారని ఆమె తెలిపారు. తన రాజకీయ ప్రవేశం సందర్భంగా ఆమె ఎంతో సహాయం చేశారని, ఎన్నో సలహాలు ఇచ్చారని అన్నారు. తాను గెలవడానికి అన్నాడీఎంకే కార్యకర్తలు పని చేయాలని ఆమె పురమాయించారని రోజా గుర్తు చేసుకున్నారు. తనకు తల్లిలేని లోటు తీర్చారని రోజా తెలిపారు. ఆమె మరణం కేవలం తమిళనాడుకే కాదని, తనలాంటి ఎంతోమందికి తీరని లోటని ఆమె అన్నారు.