: జయతో కలసి నటించిన నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్న ధర్మేంద్ర
జయలలిత ఇక లేరు అనే వార్త తనను కలచివేసిందని బాలీవుడు ప్రముఖ నటుడు ధర్మేంద్ర అన్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోలేదని తెలిసిన తర్వాత... త్వరగా ఆమె కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించానని... ఇంతలోనే ఆమె మరణవార్తను విని, దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. 'ఇజ్జత్' సినిమాలో తామిద్దరం కలసి నటించామని చెబుతూ, ఆనాటి సంగతులను ఆయన గుర్తు చేసుకున్నారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నానని చెప్పారు. జయ, ధర్మేంద్ర కలసి నటించిన 'ఇజ్జత్' సినిమా 1968లో విదుదలైంది. టి.ప్రకాశ్ రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.