: జయలలిత మృతి చాలా బాధాకరం: సినీనటుడు మ‌హేశ్ బాబు


చెన్న‌య్‌లోని అపోలో ఆసుప‌త్రిలో అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ నిన్న రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిప‌ట్ల తెలుగు సినీన‌టుడు మ‌హేశ్ బాబు సంతాపం తెలిపారు. జ‌య‌ల‌లిత మృతి చెంద‌డం ఎంతో బాధ క‌లిగించే విష‌య‌మ‌ని ఆయ‌న‌ అన్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌లకు సానుభూతి తెలుపుతున్న‌ట్లు ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. మ‌రోన‌టుడు మోహ‌న్‌బాబు స్పందిస్తూ జ‌య‌ల‌లిత మృతి త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు తీర‌నిలోట‌ని అన్నారు. మ‌హిళా శ‌క్తికి ఆమె ఓ నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పారు. ఆమె ఓ గొప్ప నేత అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News