: రాజాజీహాల్ వద్ద ఉద్వేగానికిలోనైన ప‌న్నీర్ సెల్వం, శ‌శిక‌ళను ఓదార్చిన ప్రధాని మోదీ


అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి కన్నుమూసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కడసారి వీడ్కోలు పలకడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నయ్ చేరుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన రాజాజీహాల్ ప్రాంతానికి చేరుకొని జయలలితకు నివాళులర్పించారు. మోదీ వెంట కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు కూడా ఉన్నారు. మోదీ అక్కడకు వచ్చిన సమయంలో అక్కడ ఉన్న ప‌న్నీరు సెల్వం, శ‌శిక‌ళ ఉద్వేగానికి లోనయ్యారు. వారిని మోదీ ఓదార్చారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు జయలలిత పార్థివదేహానికి జరగనున్న అంత్య‌క్రియ‌లకు కూడా మోదీ హాజ‌రుకానున్నారు. మ‌రోవైపు మ‌రికాసేప‌ట్లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు అక్క‌డ‌కు చేరుకోనున్నారు.

  • Loading...

More Telugu News