: తప్పుడు వార్తలు ప్రచారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?: యూజర్లను అడుగుతున్న ఫేస్‌బుక్
సామాజిక మాధ్యమ వెబ్‌సైట్ ఫేస్‌బుక్ తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ఎన్నో ప్రయత్నాలు జరుపుతూనే ఉంటుందన్న విషయం తెలిసిందే. తమ సైటును ఉపయోగిస్తోన్న వారి అకౌంట్లు హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండేందుకు ఇటీవలే బగ్‌లను కనిపడితే పారితోషికం అందిస్తూ ఖాతాదారులను అమితంగా ఆకట్టుకుంంది. అయితే, ఇప్పుడు మరో ముందడుగు వేసింది. ఫేస్‌బుక్‌లో వస్తోన్న ఫేక్ న్యూస్ వంటి వాటిపై దృష్టి పెట్టింది. ఫేస్‌బుక్ ద్వారా వ్యాప్తిచెందుతున్న ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి నిపుణుల టీమ్‌ను ఏర్పాటు చేసింది. తమ సైట్‌లో తప్పుడు సమాచారం ఉండకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అని తమ యూజర్లను అడుగుతోంది. ఫేస్‌బుక్‌లో ఇందుకు సంబంధించిన నిబంధనలు ఎలా ఉండాలి? అనే అంశాన్ని తమకు చెప్పమని కోరుతోంది. ఇందుకు సంబంధించి సర్వే నిర్వహిస్తున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఫేస్ బుక్ ద్వారా పలు వార్తలు వ్యాప్తిచెందాయి. దీంతో ఫేస్‌బుక్ ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శలు వచ్చాయి. ఇకపై అటువంటివి జరగకుండా చూసుకునే నేపథ్యంలో ఫేస్‌బుక్ ఈ చర్యలు తీసుకుంటోంది.