: నేను గవర్నర్‌గా పనిచేసిన సమయంలో జ‌య‌ల‌లిత‌ అందించిన సహకారం మరువలేనిది: రోశయ్య


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపట్ల ఆ రాష్ట్ర మాజీ గవర్నర్‌, మాజీ ఏపీ ముఖ్యమంత్రి రోశయ్య సంతాపం ప్రకటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆమె చేసిన సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. ఆమెను ప్రజల ముఖ్యమంత్రిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ప్రజలే కుటుంబంగా భావించి ఆమె పాల‌న కొన‌సాగించార‌ని అన్నారు. తాను త‌మిళ‌నాడు గవర్నర్‌గా పనిచేసిన సమయంలో జ‌య‌ల‌లిత‌ అందించిన సహకారాన్ని తాను ఎన్న‌టికీ మ‌రిచిపోలేన‌ని చెప్పారు. జ‌య‌ల‌లిత త‌మిళ‌నాడులో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి వారి హృద‌యాల‌ను గెలుచుకున్నార‌ని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News