: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తప్పిన ప్రమాదం... చెన్నైకి వస్తుండగా విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పెనుప్రమాదం తప్పింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితను కడసారి చూసి, నివాళి అర్పించేందుకు... ఢిల్లీ నుంచి చెన్నైకి ఆయన ఎయిర్ ఫోర్స్ విమానంలో బయల్దేరారు. అయితే, కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, విమానాన్ని మళ్లీ ఢిల్లీకి మళ్లించారు. అయితే, రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో... అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై చేరుకున్నారు. కాసేపట్లో రాజాజీ హాలుకు వెళ్లి, జయకు ఆయన నివాళి అర్పించనున్నారు.