: జయ భౌతికకాయానికి తలను తాకించి నమస్కరించిన రజనీకాంత్... శశికళను అక్కున చేర్చుకుని ఓదార్చిన రజనీ


దివంగత ముఖ్యమంత్రి జయలలితను కడసారి చూసేందుకు ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కుటుంబ సమేతంగా తరలి వచ్చారు. భార్య, ఇద్దరు కుమార్తెలు, అల్లుడు ధనుష్ తో కలసి వచ్చి... జయ పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం, జయ భౌతికకాయం పక్కనే నిలబడి రోదిస్తున్న ఆమె స్నేహితురాలు శశికళను అక్కున చేర్చుకుని ఓదార్చారు. కొన్ని నిమిషాల పాటు అక్కడే గడిపిన రజనీ... ఆ తర్వాత అందరికీ నమస్కారం చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు, తమిళ సినీరంగానికి చెందిన ప్రముఖులంతా జయను చివరిసారిగా చూసుకునేందుకు తరలి వస్తున్నారు. జయకు నివాళి అర్పిస్తున్న సందర్భంగా, నటి గౌతమి తనను తాను నియంత్రించుకోలేక భోరున విలపించారు.

  • Loading...

More Telugu News