: రెండు స్క్రీన్లు, సూపర్ ఫీచర్లు... తొలి ఆండ్రాయిడ్ 7.0 స్మార్ట్ ఫోన్ 'ఎల్జీ వీ 20'
స్మార్ట్ ఫోన్ తయారీదారు ఎల్జీ నుంచి మరో ఆకర్షణీయమైన ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. 'వీ 20' పేరిట విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్లో రెండు స్క్రీన్లు ప్రత్యేక ఆకర్షణ కాగా, ఆండ్రాయిడ్ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసేలా తయారైన తొలి స్మార్ట్ ఫోన్ ఇదే.. నేటి నుంచి అమెజాన్ లో అమ్మకాలు ప్రారంభం కాగా, ఈ ఫోన్ ధర రూ. 54,999. ప్రారంభ ఆఫర్ గా రూ. 18 వేల విలువైన బీఅండ్ఓ ప్లే హెడ్ సెట్ తో పాటు రూ. 20 వేల వరకూ కచ్చితమైన బహుమతులు అందుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. ఇందులో డ్యూయల్ రేర్ కెమెరా, 32 బిట్ హై-ఫై క్వాడ్ డాక్, హెడ్ డీ ఆడియో రికార్డర్ వంటి సదుపాయాలున్నాయి. 2 టెరాబైట్ల వరకూ మెమొరీని పెంచుకునే సామర్థ్యం ఉంటుంది. 64 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 5.7 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే, 4 జీబీ రామ్, 16/8 ఎంపీ వెనుక కెమెరాలు, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3200 ఎంఏహెచ్ బ్యాటరీతో లభించే ఫోన్ 4జీ వీఓఎల్టీఈ, వైఫై- జీపీఎస్, బ్లూటూత్ సదుపాయాలున్నాయి.