: ఆన్‌లైన్‌ మిత్రుడితో డేటింగ్‌లో ఉందని భార్యను హతమార్చిన భర్త


అమెరికాలో ఓ భారత సంతతి వ్యక్తి ప్రేమ్‌ రామ్‌పర్సోడ్‌‌ (50) దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న‌ భార్య రజ్వాంటీ బాల్డియో(46)ను క‌త్తితో పొడిచి హ‌త‌మార్చాడు. ఈ దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మ‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌పై అక్క‌డి అధికారులు మీడియాకు వివ‌రిస్తూ ఓ రెస్టారెంట్లో ప‌నిచేస్తోన్న రజ్వాంటీ బాల్డియో త‌న విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్న స‌మ‌యంలో ప్రేమ్ క‌లిశాడ‌ని చెప్పారు. అయితే, ఆ సమయంలో ప్రేమ్ త‌న భార్య‌తో గొడ‌వ‌ప‌డ్డాడ‌ని, త‌రువాత త‌న వ‌ద్ద ఉన్న‌ కత్తితో ఆమెపై దాడి చేశాడని చెప్పారు. తీవ్ర‌గాయాల పాల‌యిన ఆమెను ద‌గ్గ‌ర‌లోని ఆసుపత్రికి తీసుకెళ్ల‌గా అక్క‌డ ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింద‌ని పేర్కొన్నారు. ఆమె ఓ ఆన్‌లైన్ మిత్రుడితో డేటింగ్‌లో ఉన్నట్లు తెలుసుకొని ఆమెతో గొడ‌వ‌ప‌డి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడ‌ని స‌మాచారం.

  • Loading...

More Telugu News