: ఎంజీఆర్, ఎన్టీఆర్ కాదు... జయలలిత ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?
తన అద్భుత నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న జయలలితకు ఫేవరెట్ హీరో ఎవరు? తాను తమిళంలో అత్యధికంగా జతకట్టిన ఎంజీ రామచంద్రన్ లేదా, తెలుగులో ఎక్కువ సినిమాలు చేసిన ఎన్టీఆర్ లు కాదు. బాలీవుడ్ స్టైలిష్ హీరో షమ్మీకపూర్. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జయలలిత స్వయంగా చెప్పారు. అంతేకాదు, 'చాహే కోయీ ముఝే జంగ్లీ కహే' పాటంటే తనకు ఎంతో ఇష్టమని ఆ పాటను హమ్ చేశారు కూడా. రాజకీయాల్లోకి రావాలని తాను భావించలేదని, న్యాయవాద వృత్తిలో రాణించాలని తాను అనుకుంటే, దేవుడు మరొకటి అనుకున్నాడని చెప్పారు జయ. చిన్నతనంలో క్రికెటర్ నారీ కాంట్రాక్టర్ అంటే ఇష్టమని, ఆయన్ను చూసేందుకే టెస్టు మ్యాచ్ లకు కూడా వెళ్లానని చెప్పారు.