: జనసంద్రమౌతున్న అన్నాసలై... ఎంజీఆర్ సమాధి పక్కనే జయకు శాశ్వత విశ్రాంతి!
నేటి సాయంత్రం చెన్నై మెరీనా బీచ్ లో జయలలిత అంత్యక్రియలు జరుగుతాయన్న ప్రకటన వెలువడిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడే ఎంజీ రామచంద్రన్ సమాధి ఉన్న సంగతి తెలిసిందే. దీన్నే తమిళులు అన్నాసలై అని కూడా పిలుచుకుంటారు. ఇక ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత అంత్యక్రియలు జరుగుతాయని, అక్కడే జయ స్మారక స్థూపం ఉంటుందని ప్రభుత్వ అధికారులు తెలియజేయగా, ఈ ప్రాంతానికి ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు చేరుకుంటున్నారు. అన్నాసలై జనసంద్రంగా మారగా, పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.