: మామూలుగానే కనిపిస్తున్న 'అమ్మ'!
జయలలిత... 70 రోజులకు పైగా మృత్యువుతో పోరాడి అలసి ఓడిన మహా వనిత. ఆమె పార్థివదేహం రాజాజీ హాల్ లో ప్రజల కడసారి దర్శనార్థం ఉంచగా, ఆమె దేహం మామూలుగా చూసినట్టుగానే ఉందని, మృత దేహమంటే ఎవరూ నమ్మేట్టు లేదని, తమ పురచ్చితలైవి, అమ్మ నిద్రిస్తోందని తమిళులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్నప్పుడు ఏ విధమైన చిత్రాలు రాలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఆమె మామూలుగా ఉన్న వేళ ఎలా కనిపిస్తుందో, మరణించిన తరువాత కూడా అలాగే కనిపించేలా మేకప్ చేశారు. సన్నటి బొట్టుతో ఆమె నిద్రిస్తున్నట్టే కనిపిస్తున్నారు. ఆమె మృతదేహం పక్కనే స్నేహితురాలు శశికళ విషణ్ణ వదనంతో నిలబడి వుండగా, వేలాది మంది ఆమెను ఆశ్రునయనాలతో కడసారి వీక్షిస్తున్నారు.