: ఈ రోజు సాయంత్రం జయ అంత్యక్రియలు.. పార్థివదేహం పోయెస్ గార్డెన్‌కు తరలింపు


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పార్థివ దేహాన్ని ఆమె అధికారిక నివాసం పోయెస్ గార్డెన్‌కు తరలించారు. కాన్వాయ్ వెంట రాగా ప్రత్యేక అంబులెన్స్‌లో ఈ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఏఐఏడీఎంకే పార్టీ ముఖ్య నేతలు కాన్వాయ్‌ను అనుసరించారు. జయ పార్థివ దేహం పక్కనే ఆమె నెచ్చెలి శశికళ ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ‘అమ్మ’ అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News