: అపోలో ఆసుపత్రిలో ముగిసిన ఏఐఏడీఎంకే సమావేశం.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ?


అపోలో ఆసుపత్రిలో నిర్వహించిన ఏఐఏడీఎంకే శాసనసభా పక్షం సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి సమాచారం నేటి సాయంత్రం వెలువడనుందన్న వార్తల నేపథ్యంలో అన్నాడీఎంకే నేతలు భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో ఉన్నత స్థాయి నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రిగా ఎవరిని నిర్ణయించాలన్న దానిపై చర్చించారు. పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా, శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన నెలకొంది. మరోపక్క చెన్నై వ్యాప్తంగా హై అలెర్ట్ విధించారు. భారీ ఎత్తున బలగాలు, పోలీసులను మోహరించారు. దీంతో అభిమానుల ఆందోళన మరింత పెరుగుతోంది. అంతా బాగుంటే ఈ ఏర్పాట్లు ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News