: జయలలిత కోలుకోవాలంటూ శబరిమలకు పోటెత్తుతున్న ‘అమ్మ’ అభిమానులు


జయలలిత కోలుకోవాలని కోరుకుంటూ ‘అమ్మ’ అభిమానులు కేరళలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమలకు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల వద్ద భద్రతను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. కొబ్బరికాయలు సమర్పించే ప్రాంతంలో కూడా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రేపు బ్లాక్ డే (బాబ్రీ మసీదును కూల్చి వేసిన రోజు) కావడం, ‘అమ్మ’ కోసం ప్రత్యేక పూజల నిమిత్తం ఆమె అభిమానులు అక్కడికి పోటెత్తుతున్న నేపథ్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్పెషల్ టీమ్ ను రంగంలోకి దింపారు. శబరిమల ఆలయానికి సమీపంలో 360 కిలోల గన్ పౌడర్ పట్టుబడటంతో, అటవీ ప్రాంతంలో సెక్యూరిటీని ఆ రాష్ట్ర పోలీసులు మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, ‘అమ్మ’ జయలలిత కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఈరోజు అన్నదానం నిర్వహించింది.

  • Loading...

More Telugu News