: అపోలో పరిసరాల్లో మొబైల్ నెట్ వర్క్ సర్వీసుల నిలిపివేత


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు చికిత్స అందిస్తున్న అపోలో ఆసుపత్రి పరిసరాల్లో అన్ని రకాల మొబైల్ నెట్ వర్క్ సర్వీసులు నిలిపివేశారు. ఆసుపత్రి నుంచి ఎలాంటి వార్తలు బయటకు పొక్కకుండా ఉండేందుకు యాజమాన్యం, ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కాగా, నిన్న సాయంత్రం నుంచి అపోలో ఆసుపత్రి పరిసరాల్లోని టెలికాం నెట్వర్క్ అందించే అన్ని సాధానాలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. పార్టీశ్రేణులు చేసే ఫోన్లు, ఆదేశాలందుకునే పోలీసుల ఫోన్లు, మీడియా ప్రతినిధుల ఫోన్లు మోగుతూనే ఉన్నాయి. దీంతో వీటన్నింటిపై తీవ్ర ఒత్తిడి పడింది. ఇంతలో జయలలిత మృతి చెందారంటూ పుకార్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అపోలో పరిసరాల్లోని మొబైల్ నెట్వర్క్స్ అన్నింటిని ఆపేశారు. అంతే కాకుండా అపోలో పరిసరాల్లో పోలీసులను భారీ ఎత్తున మోహరించారు.

  • Loading...

More Telugu News