: మీడియాతో మాట్లాడకుండానే ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన వెంకయ్యనాయుడు


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అపోలో ఆసుపత్రికి వచ్చిన అనంతరం వైద్యులు, నిపుణులతో చర్చించి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఒక ప్రకటన చేస్తారంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతలో జయలలిత మృతి చెందారంటూ పుకార్లు షికార్లు చేయడంతో అపోలో పరిసరాల్లో తీవ్ర ఉద్రికత్తత చోటుచేసుకుంది. ఈలోగా వెంకయ్యనాయుడు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో అపోలో వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. మరోపక్క ఆసుపత్రిలో వెంకయ్యనాయుడు వైద్యులు, నిపుణులతో చర్చించారు. వైద్యం వివరాలు, ఆమె శరీరం స్పందిస్తున్న విధానం పూర్తిగా తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి నుంచి మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు. దీంతో వెంకయ్యనాయుడు వస్తారు, ఏదో ఒక వార్త తీసుకొస్తారు అని ఎదురు చూసిన, మీడియా, పార్టీ శ్రేణులు, అమ్మ అభిమానులు, ఆయన మౌనంగా నిష్క్రమించడంతో నిరాశ చెందారు.

  • Loading...

More Telugu News