: చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్.. ముందస్తు జాగ్రత్తగా నిత్యావసరాల కొనుగోలు


అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించడం.. ఆపై వదంతులు వ్యాపించడంతో చెన్నైలోని పలు కార్యాలయాలకు ఈరోజు మధ్యాహ్నం నుంచే సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పలు కార్యాలయాల ఉద్యోగులు ఒకేసారి రోడ్లపైకి చేరడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ముఖ్యంగా నుంగంబాకమ్ నుంచి కీల్ పౌక్ లోని టేలర్స్ రోడ్ వరకు, నెల్సన్ మనిక్కామ్ రోడ్, శాంతి కాలనీ మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. అంతేకాకుండా, ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ముందస్తు జాగ్రత్తగా నిత్యావసరాలు, పాలు... మొదలైన వాటిని కొనుగోలు చేసేందుకు వస్తున్న ప్రజలతో నుంగంబాకమ్ లోని చాలా దుకాణాలు నిండిపోయాయి.

  • Loading...

More Telugu News