: ముందు జెండాను దించేశారు.. మళ్లీ ఎగురవేశారు!


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. జయలలిత మృతి చెందారంటూ డీఎంకేకు చెందిన టీవీ చానెళ్లలో వార్తలు ప్రసారం కావడంతో తమిళనాడు భగ్గుమంది. ఈ వార్తలను చూసిన అన్నాడీఎంకే పార్టీ ఆఫీసులోని పార్టీ సిబ్బంది కూడా పొరపడ్డారు. దీంతో పార్టీ జెండాను అవనతం చేశారు. అనంతరం అపోలో ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్స కొనసాగుతోందని, ఆమె మృతి చెందారంటూ వచ్చిన వార్తలు నిరాధారమని, తప్పుడు వార్తలని ప్రకటించారు. దీంతో పార్టీ కార్యకర్తల హర్షాతిరేకాల మధ్య మళ్లీ జెండాను యథావిధిగా ఎగురవేశారు. అయినప్పటికీ పార్టీ కార్యకర్తల్లో ఉత్కంఠ మాత్రం వీడలేదు. స్కూళ్లు, కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ కు సెలవు ప్రకటించడం, పెట్రోల్ బంకులు మూసేయడంతో తమిళనాట నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రధానంగా అన్నా డీఎంకే కార్యకర్తల్లో ఒకరకమైన ఆందోళన, నిస్తేజం అలముకున్నాయి.

  • Loading...

More Telugu News