: పోలీసుల దిగ్బంధంలో చెన్నై... పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్న నేతలు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారంటూ కొన్ని ఛానళ్లలో వార్తలు రావడంలో... ఆమె అభిమానులు ఒక్కసారిగా విధ్వంసానికి దిగిన సంగతి తెలిసందే. దీంతో, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు. చెన్నైని పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. కరెక్ట్ గా చెప్పాలంటే... చెన్నై హైఅలర్ట్ లో ఉంది. అడుగడుగూ తమ అదుపులో ఉండేటట్టు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నగరం నుంచి అపోలో ఆసుపత్రికి వెళ్లే అన్ని దారులనూ మూసి వేశారు. మరోవైపు, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. జయలలిత క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.