: జయ మృతి నిజమా? కాదా?... పార్టీ కార్యాలయం వద్ద జెండా సగం అవనతం
ఓ వైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారంటూ కొన్ని తమిళ ఛానళ్లలో వార్తలు. మరోవైపు, ఆ వార్తలను ఖండిస్తున్న అపోలో ఆసుపత్రి యాజమాన్యం. దీంతో, అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థంకాని గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే, ఓ విషయం మాత్రం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సగం వరకు అవనతం చేశారు. దీంతో, జయ చనిపోయారేమో అన్న అనుమానం చాలా మందిలో తలెత్తింది. పలువురు ప్రముఖులు, సామాన్యులు జయ మృతి పట్ల సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో సంతాపాన్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో, రాత్రి 10 గంటలు దాటితే కానీ... ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.