: రాహుల్ 'జనగణమన' పాడితే చూడాలని ఉంది: అనుపమ్ ఖేర్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రముఖ బాలీవుడ్ నుటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రాహుల్ గాంధీ భారతీయతపై ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు. అయితే, మన జాతీయగీతాన్ని రాహుల్ పాడుతుండగా చూడాలనే కోరిక ఉందని అన్నారు. జనగణమన గీతంలోని పదాలయినా రాహుల్ కు తెలుసో? లేదో? తెలుసుకోవాలన్న కోరిక ఉందని ఎద్దేవా చేశారు. సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే, అనుపమ్ ఖేర్ ఈ వ్యాఖ్యలు చేశారు.