: తమిళనాట అన్నా డీఎంకే కార్యకర్తల విధ్వంసం ప్రారంభం
తమిళనాట విధ్వంసం ప్రారంభమైంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై కీలక ప్రకటన వెలువడనుందని అపోలో ఆసుపత్రి వద్ద ప్రకటించిన వెంటనే అన్నా డీఎంకే కార్యకర్తల విధ్వంసకాండ ప్రారంభమైంది. అపోలో ఆసుపత్రి వద్దకు భారీగా చేరుకున్న అన్నాడీఎంకే శ్రేణులను పోలీసులు నియంత్రించడం ప్రారంభించారు. అమ్మను చూస్తామంటూ పార్టీ శ్రేణులు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బారికేడ్లు, హోర్డింగ్ లు, వాహనాలు.. ఇలా అడ్డం వచ్చిన ప్రతిదానిని విసిరికొట్టారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.