: నోట్లరద్దు నేపథ్యంలో షిర్డీ సాయిసంస్థాన్‌కు భారీగా ఆదాయం
దేశంలో తిరుపతి తరువాత షిర్డీ సాయిబాబా ఆలయానికే అత్యధిక ఆదాయం లభిస్తుందన్న విషయం తెలిసిందే. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఆ ఆలయానికి మరింత ఆదాయం చేకూరుతోంది. రద్దయిన నోట్లను భక్తులు ఆలయాల్లో కానుకలుగా సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆలయాలకు వచ్చిన ఆదాయాలపై వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో షిర్డీ సాయిబాబా ఆలయ అధికారులు వివరాలు తెలుపుతూ పెద్దనోట్లు రద్దైన రోజు నుంచి గతనెల 24 మధ్య తేదీల్లో సుమారు రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. వాటిల్లో రూ.1000 నోట్లు రూ.1.27 కోట్ల రూపాయలు ఉండగా, రూ.500 నోట్లు 1.57 కోట్లు వచ్చాయని చెప్పారు. ఆలయంలో మొత్తం 47 హుండీలు ఉన్నాయని పేర్కొన్నారు.