: నా దైవసమానురాలు 'అమ్మ' త్వరగా కోలుకోవాలి: సినీనటి గౌతమి


చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృత్యువుతో పోరాడుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఆమెను కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆమె వెంటనే కోలుకోవాలని సినీనటి గౌతమి ఆకాంక్షించారు. జయలలిత తనకు దైవసమానురాలని... ఆమె మళ్లీ కోలుకుని, తమిళనాడు ప్రజలకు సేవలందించేలా చూడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అమ్మకు సంపూర్ణ ఆయుష్షు, మంచి ఆరోగ్యం అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. శక్తికి, దయకు మారు పేరు జయలలిత అని అన్నారు.

  • Loading...

More Telugu News