: ప్రముఖ డిజైనర్ మనీష్ బర్త్ డే వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖులు


ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా పుట్టిన రోజు వేడుకలకు బాలీవుడ్ తారాగణం తరలివెళ్లింది. ముంబయిలోని పాలి హిల్స్ లోని నివాసంలో తన 50వ పుట్టినరోజు వేడుకలను నిన్న అర్ధరాత్రి ఘనంగా జరుపుకున్నాడు. ఈ పార్టీకి శ్రీదేవీ, బోనీకపూర్, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్, రవీనా టాండన్, షబ్నా ఆజ్మీ, కరిష్మాకపూర్, జావేద్ అక్తర్ తో పాటు ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహర్ కూడా హాజరయ్యారు. కాగా, మనీష్ మల్హోత్రాకు మిత్రుడైన కరణ్ జొహర్ ఈరోజు సాయంత్రం ఒక పార్టీని ఏర్పాటు చేయనున్నాడని, ఈ పార్టీకి బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News