: జయలలిత నుంచి ఎంతో నేర్చుకున్నాం: కేంద్ర మంత్రి ఉమాభారతి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, జయలలిత నుంచి తాము ఎంతో నేర్చుకున్నామని, దేశం గర్వించదగ్గ నేతల్లో ఆమె ఒకరని ఉమాభారతి అన్నారు. కాగా, ‘అమ్మ’ జయలలిత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడిందని, ఆసుపత్రి నుంచి త్వరలో డిశ్చార్జి చేస్తారని నిన్న సాయంత్రం అన్నా డీఎంకే పార్టీ నేతలు ప్రకటించడం విదితమే. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే జయలలితకు గుండెపోటు రావడం గమనార్హం.