: సోషల్ మీడియాలో కలకలం రేపిన ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య పుకారు!


ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య చేసుకుందంటూ రేగిన పుకారు సోషల్ మీడియాలో కలకలం రేపింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమాలో రణ్ బీర్ కపూర్ తో అత్యంత సన్నిహితంగా నటించిన ఐశ్వర్యకు భర్తతో కలతలు రేగాయని, ఈ నేపథ్యంలో ఐశ్వర్యారాయ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని పుకార్లు షికార్లు చేశాయి. ఆమె ఆత్మహత్యను సీక్రెట్ గా ఉంచారని, వివాదాలంటే ఇష్టం ఉండని అమితాబ్ కుటుంబం మౌనంగా ఉందని పేర్కొంటూ పుకార్లు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న వీకెండ్ లో ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో ఆమె కనిపించడంతో ఆమె 'ఆత్మహత్య' ఒట్టి పుకారు అన్న విషయం అర్థమైంది. కాగా, గతంలో చాలా మంది బాలీవుడ్ నటులపై ఆత్మహత్యాయత్నం పుకార్లు రేగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News