: చెన్నయ్ అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన నేపథ్యంలో అక్కడికి భారీగా అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు చేరుకుంటున్నారు. ఇప్పటికే అక్కడి హోటళ్లను ఖాళీ చేయించిన పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో అన్ని దుకాణాలనూ మూసేయాలని చెబుతున్నారు. దీంతో అక్కడి ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి అరకిలోమీటరు దూరంలోనే అభిమానులు, కార్యకర్తలను ఆపేస్తున్నారు.