: రాజ్యసభలో ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేసిన విపక్ష సభ్యులు

వాయిదా అనంతరం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. విపక్ష నేతల ఆందోళన పట్ల స్పందించిన కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయకుండా చర్చలు జరిగేలా సహకరించాలని అన్నారు.