: చెన్నయ్ అపోలో ఆసుపత్రికి చేరుకున్న లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బేలే
చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో లండన్ వైద్య నిపుణుడు రిచర్డ్ బేలేను అపోలోకు రావాల్సిందిగా ఆ ఆసుపత్రి వైద్యులు ఈ రోజు ఉదయం కోరిన సంగతి తెలిసిందే. వైద్యుల పిలుపుతో రిచర్డ్ బెలే కొద్ది సేపటి క్రితం ఆసుపత్రికి చేరుకున్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని ఆయన పరీక్షిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రి వైద్య నిపుణుల బృందం జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని వైద్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం ఆసుపత్రి మరో బులిటెన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా జయలలిత ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం.