: ‘అత్యంత విషమం’.. జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం ఐదు లైన్ల హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. అందులో నిన్న సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ కు గురైన జయలలిత ఆరోగ్యం ఇప్పుడు మరింత దిగజారిందని పేర్కొన్నారు. ఈసీఎంవో, లైఫ్ సపోర్టింగ్ స్టిస్టమ్స్ ద్వారా ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నట్లు అందులో తెలిపారు. సుబ్బయ్య విశ్వనాథం అనే అపోలో వైద్యుడి పేరిట ఈ ప్రకటన విడుదలైంది. తాజా బులిటెన్ విడుదలతో ఆసుపత్రి వద్ద ఆమె అభిమానులు మరింత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.