: టీవీ నటిపై అత్యాచారం, హత్య... బంగారం దోచుకెళ్లిన దుండగులు


తమిళనాట టీవీ సీరియల్స్ లో నటి, మోడల్ జయశీలిని హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు, ఆమె వద్ద ఉన్న బంగారం దోచుకు వెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ పథకం ప్రకారం, ఆమెను హత్య చేశారని, ఇంట్లో ఉండాల్సిన 50 సవర్ల బంగారం పోయిందని ఆమె తమ్ముడు సెల్వరాజ్ ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. చెన్నయ్ పెరియార్ వీధిలోని ఆమె నివాసం నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. మంచంపై ఆమె మృతదేహం నగ్నంగా ఉండటంతో అత్యాచారం అనంతరం హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాఫ్తులో తేల్చారు. ఆమె ఒంటిపై ఉన్న రోల్డ్ గోల్డ్ నగలు అలాగే వుండడం, గదిలో సువాసనలు వెదజల్లే పర్ ఫ్యూములు చల్లడం వంటి చర్యలతో బంధువులు లేదా తెలిసిన వారి పనేనని భావిస్తున్నామని, కేసును విచారిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News