: తెలంగాణలో పూర్తి నగదురహిత లావాదేవీలు నిర్వహిస్తోన్న గ్రామంగా ఇబ్రహీంపూర్ రికార్డు
పూర్తిస్థాయిలో నగదురహిత లావాదేవీలు జరుపుతున్న గ్రామంగా తెలంగాణ, సిద్ధిపేటలోని ఇబ్రహీంపూర్ గ్రామం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవలే మహారాష్ట్రలో థానెలోని ఓ గ్రామం ఇటువంటి ఘనతే సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన సంగతి తెలిసిందే. నగదు రహిత లావాదేవీలు జరుపుతూ మారుమూల గ్రామాలు నగరాలకే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇబ్రహీంపూర్ సాధించిన ఈ ఘనతను గురించి మంత్రి హరీశ్‌రావు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నారు.